బషీర్‌బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులు, ఉద్యోగులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ కోడ్‌లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని టీయూడబ్ల్యూజే(-ఐజేయూ), కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఈ సందర్భంగా మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, కార్మిక సంఘాల నేతలతో చర్చించకుండానే కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. ఈ ఇష్యూపై మీడియా చర్చలు పెట్టకపోవడం విచారకరమన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ కృష్ణారావు, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.యూసుఫ్, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్.పద్మ, ఐజేయూ స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవులపల్లి అమర్ పాల్గొన్నారు.
