ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ల్యాప్​టాప్ ​

ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ల్యాప్​టాప్ ​

ఎలక్ట్రానిక్స్​ బ్రాండ్​ ఇన్ఫినిక్స్ ​ఇండియా మార్కెట్లో ఇన్​బుక్ ​ఎక్స్​2 ల్యాప్​టాప్​ను లాంచ్​ చేసింది. ఇది కేవలం 1.25 బరువు, 14.8 ఎంఎం మందం ఉంటుంది. ఇంటెల్​ ఐ3 చిప్‌సెట్‌తో కూడిన ఇన్ఫినిక్స్​ ఇన్​బుక్​ ఎక్స్​2 స్లిమ్​  8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,990 కాగా, 512జీబీ స్టోరేజ్  మోడల్ రేటు రూ. 31,990. ప్రస్తుతం ఈ మోడల్స్​పై రూ. 2,000 చొప్పున డిస్కౌంట్​ ఉంది.

16జీబీ + 512జీబీ ఇంటెల్ కోర్ ఐ5 మోడల్ ధర రూ.39 వేలు కాగా, 16జీబీ + 1టీబీ  వేరియంట్​ ధర 40,990.  అయితే, 16జీబీ + 512జీబీ ఇంటెల్ కోర్ ఐ7 వేరియంట్ ధర రూ. 48,990. ఈనెల తొమ్మిది నుంచి ఫ్లిప్​కార్ట్​లో ఆర్డర్​ చేయవచ్చు.