మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి సీపీ కొత్త క్యాంప్ ఆఫీస్ ను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సమీపంలోని మల్కాజిగిరి జోనల్ ఆఫీస్ప్రాంగణంలో(నేరేడ్‌మెట్) ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సీపీ సుమతి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంసీ ‘ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్’ కొత్త చాంబర్లు ప్రారంభం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీకి సంబంధించి ఒక్కో విభాగం మాదాపూర్ లోని న్యాక్ భవనానికి షిఫ్ట్ అవుతున్నాయి. ఇదివరకు నార్సింగిలో కొనసాగినప్పటికీ ఇక్కడ చాంబర్లు రెడీ కావడంతో అధికారులు షిఫ్ట్ అవుతున్నారు. బుధవారం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల నూతన ఛాంబర్లను ఎన్ఏసీ భవనం రెండో అంతస్తులో సీఎంసీ కమిషనర్ సృజన ప్రారంభించారు.
