కొత్త స్విఫ్ట్ 2024 మోడల్ కారు వచ్చేసింది.. ఫీచర్స్, ధర, మైలేజ్ ఎంతంటే..!

కొత్త స్విఫ్ట్ 2024 మోడల్ కారు వచ్చేసింది.. ఫీచర్స్, ధర, మైలేజ్ ఎంతంటే..!

మారుతీ సుజికీ కంపెనీ నుంచి కొత్త కారు మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. స్విఫ్ట్ 2024 మోడల్ కారును ఇండియాలో లాంఛ్ చేసింది కంపెనీ. 2005లో ఫస్ట్ వెర్షన్ రిలీజ్ కాగా.. ఇప్పుడు నెక్ట్ జనరేషన్ కు తగ్గట్టుగా కొత్త మోడల్ ను తీర్చిదిద్దినట్లు ప్రకటించింది కంపెనీ. ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయని.. లవ్ ఫర్ డ్రైవింగ్ ట్యాగ్ తో నేటి యువతరాన్ని టార్గెట్ చేసుకుని.. 2024 స్విఫ్ట్ మోడల్ కారు ఉందని వెల్లడించింది కంపెనీ..

2024 స్విఫ్ట్ మోడల్ ఫీచర్స్ ఇలా :

>>> స్టాండర్డ్ మోడల్ లోనూ ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. హాచ్ బ్యాక్ మోడల్.
>>> ఇంజిన్ కెపాసిటీ 1199 సీసీగా ఉంది. 3 సిలిండర్స్ ఉన్నాయి. 
>>> గేర్ బాక్స్ విషయానికి వస్తే.. మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్ ఉన్నాయి.
>>> మూడు సీట్ బెల్ట్ లు ఇచ్చారు. సీటింగ్ కెపాసిటీ 5. 
>>> ఆరు వేరియంట్స్ లో స్విఫ్ట్ రిలీజ్ చేశారు. LXi, VXi, VXi(o), ZXi, ZXi+, ZXi+dual Tone
>>> ఇంజిన్ విషయానికి వస్తే 1.2 లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. దీని వల్ల  12 శాతం పొల్యూషన్ తగ్గుతుందని ప్రకటించింది కంపెనీ. 

మైలేజ్ ఎంత వస్తుంది :

>>> మాన్యువల్ మోడల్ లో లీటర్ పెట్రోల్ కు 24.8 కిలోమీటర్లు
>>> ఆటోమేటిక్ గేర్ మోడల్ లో లీటర్ పెట్రోల్ కు 25.7 కిలోమీటర్లు

 కొత్త స్విఫ్ట్ ధర ఎంతంటే.. :

>>> మాన్యువల్ LXi ధర రూ.6 లక్షల 49 వేలు (ఎక్స్ షోరూం ధర)
>>> VXi ధర రూ.7 లక్షల 29 వేల 500 (ఎక్స్ షోరూం ధర)
>>> ZXi+DualTone రూ.9 లక్షల 14 వేల 500 (ఎక్స్ షోరూం ధర)

ఆటోమేటిక్ వెర్షన్ ను VXi నుంచి ఉన్నాయి. స్టార్టింగ్ ధర రూ.7 లక్షల 79 వేల 500 (ఎక్స్ షోరూం ధర)
ఆటోమేటిక్ వెర్షన్ లో హైఎండ్ ZXi+DualTone ధర రూ.9 లక్షల 65 వేల 500 (ఎక్స్ షోరూం ధర)

EMI ఆప్షన్ ఇలా :

>>> ఎక్స్ షోరూం ధర, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ అన్నీ కలుపుకుని.. ప్రతినెలా 17 వేల 436 రూపాయలు చెల్లిస్తే చాలు.. కారును ఇచ్చేస్తారు. మంత్లీ సబ్ స్క్రిప్టర్ ఆప్షన్ స్కీం కూడా లాంచింగ్ సమయంలోనే ప్రకటించింది కంపెనీ. 

మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ అయితే సింపుల్ గా.. యూనిక్ గా ఉంది. టాటా పంచ్, హుందాయ్ నియోస్, టాటా టియోగాకు కాంపిటీషన్ గా ఉండొచ్చని ఆటో ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా మైలేజ్ బాగా ఇస్తుండటం విశేషం.