బాధ్యతలు తీసుకున్న కొత్త మంత్రులు

బాధ్యతలు తీసుకున్న కొత్త మంత్రులు

కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఉదయం సెక్రటేరియట్ డీ బ్లాక్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

రైతు బంధు ఆత్మాభిమానాన్ని పెంచే పథకం అనీ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టగలుగుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.

విద్యాశాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.  మంత్రులకు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు.

ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు పెంచేందుకు కృషిచేస్తామన్నారు. కేజీ టు పీజీ ఉచిత నాణ్యమైన విద్య పథకంపై ఫోకస్ పెడుతున్నామన్నారు.

అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ లాబీ చాంబర్ లో పూజలు చేసి బాధ్యతలు తీసుకున్నారు.