
హైదరాబాద్, వెలుగు: ప్రీమియం డిజైన్, ఫీచర్లు ఉన్న కొత్త నెక్సాన్ మోడల్ సికింద్రాబాద్‌లోని జాస్పర్ టాటా మోటార్స్ డీలర్‌షాప్‌లో లాంచ్ అయ్యింది. ఈ బండి ప్రారంభ ధర రూ. 8.09 లక్షలు (ఎక్స్‌షోరూమ్). పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మూడు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ల ఇంజిన్, డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ల ఇంజిన్‌ను అమర్చారు. నెక్సాన్ స్టార్టింగ్ మోడల్ నుంచే ఆరు ఎయిర్ బ్యాగ్‌లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.
అంతే కాకుండా ఈ కారుకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. జాస్పర్ టాటా మోటార్స్ డీలర్‌షాపులో నెక్సాన్ కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తిరువీర్ వచ్చారు. జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సంజీవ్ రావ్, టాటా టీఎస్‌ఎం సాయి చరణ్, జీఎం కిరణ్ పాషం, ఎస్‌ఎం సాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.