రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి మాస్క్లేని ఫొటోలు వైరల్ ..

రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి  మాస్క్లేని ఫొటోలు వైరల్ ..

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడు  బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముసుగు లేకుండా టోపి లేకుండా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తూర్పు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో మార్చిన 1 న పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడుతో 10 మంది గాయపడ్డారు. నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీ(NIA) ఇటీవల అనుమానిత బాంబర్ టోపీ ముసుగు అద్దాలు ధరించి ఉన్న చిత్రాలను షేర్ చేయగా.. తాజాగా టోపీ, ముసుగు లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఫొటోల వెలుగులోకి వచ్చాయి. 

ప్రస్తుతం ఈ కేసు ను విచారిస్తున్న  ఎన్ ఐఏ అధికారులు బృందాలుగా విడిపోయి ఇటీవల కర్ణాటక లోని బళ్లారీలో పర్యటించారు. అక్కడ కీలక సమాచారాన్ని సేకరించారు. పేలుడు తర్వాత బెంగళూరు నుంచి తుమకూరుకు నిందితుడు వెళ్లి అక్కడినుంచి బళ్లారికి వెళ్లినట్టు గుర్తించారు. మరో ఎన్ ఐఐ బృందం తుమకూరు బస్టాండులో అనుమానితుడు కదలికలను గుర్తించినట్లు తెలుస్తోంది. బళ్లారి లో ఎన్ ఐఏ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం.. నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం నుంచి కోస్తా కర్ణాటకలోని గోకర్ణ నగరానికి బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. 

బెంగళూరులోని BMTC వోల్వో బస్సులో నిందితుడు ప్రయాణిస్తున్నపుడు మాస్క్,టోపీ లేకుండా ఉన్న ఫొటోలు సేకరించారు. బాంబర్ ఉత్తర కన్నడ జిల్లాలో భత్కల్ పట్టణంలో ఉండొచ్చని ఎన్ ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. స్లీపర్ సెల్స్ మద్దతుతో విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళికలు సిద్దం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు ఎన్ ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మార్చి 1న పేలుడు సంభవించిన రామేశ్వరం కేఫ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. మార్చి 8న ఈ కేఫ్ ను తెరవనున్నారు.