ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే...

ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే...

నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ హామీలను నెరవేరుస్తోంది. తాజాగా మునుగోడు, చండూరు మండలాలకు ఆరు కొత్త రేషన్ షాపులను శాంక్షన్ ​చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఆగస్టులో తండాలను పంచాయతీలుగా మార్చడంతో పాటు, కొన్ని కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో రేషన్​ షాపుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉండె. రూల్స్ ​ప్రకారం ఆవాస ప్రాంతాల నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు రేషన్​షాపులు లేనట్లయితే కొత్త షాపులివ్వాలి. రూరల్​లో అయితే 5 వందల కార్డులు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 6 వందల నుంచి 800 కార్డుదారులు తప్పనిసరి.

ఈ రూల్స్​ప్రకారం చండూరు, మునుగోడులో ఆరు షాపులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కలెక్టర్ ​వినయ్​ కృష్ణారెడ్డి గత నెల18న ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్డీఓ నుంచి ప్రపోజల్స్​ తెప్పించారు. చండూరు మండలంలో గొల్లగూడెం, శేరిగూడెం..మునుగోడు మండలంలో రావిగూడెం, గుండలోరిగూడెం, గంగోరి గూడెం, బీరెల్లిగూడెం గ్రామాలకు షాపులు మంజూరు చేశారు. ఒక్కో గ్రామంలో 114 నుంచి 290 కార్డులున్నాయని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఈ షాపులకు అవసరమయ్యే డీలర్ల నియాకమ ప్రక్రియ కూడా త్వరగా చేపట్టాలని కలెక్టర్​ ఆర్డీఓను ఆదేశించారు.