కొత్త రీసెర్చ్.. మెదడుతో రోబో కంట్రోల్

కొత్త రీసెర్చ్.. మెదడుతో రోబో కంట్రోల్

యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ  పరిశోధకులు బయోసెన్సర్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దాంతో రోబోలు ఇతర యంత్రాలను మైండ్ (ఆలోచన) ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఫాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్, ఐటీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ చిన్ టెంగ్ లిన్, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కా ఇయాకోపి ఆధ్వర్యంలోఈ టెక్నాలజీ రూపొందించారు. ఇది అధునాతన మెదడు, కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ని కలిగి ఉంటుంది.

వైకల్యం ఉన్నవాళ్లు, వీల్ చెయిర్ పై నుంచి లేవలేనివాళ్లు ఈ టెక్నాలజీ సాయంతో ఇతరులతో కమ్యూనికేట్ అవ్వొచ్చు. ఇది పూర్తిగా హ్యాండ్స్ ఫ్రీ, వాయిస్ ఫ్రీగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీని సిలికాన్, గ్రాఫేన్ మెటీరియల్ ని కలిపి తయారుచేశారు. ఇది పూర్తిగా డస్ట్, వాటర్, రస్ట్ రెసిస్టెంట్.