స్ట్రిమ్ ఎంగేజ్: OTT Movies

స్ట్రిమ్ ఎంగేజ్: OTT Movies

శివుడి ప్రతిమ దొరికిందా?

టైటిల్ - సురాపానం
కాస్ట్​ - సంపత్ కుమార్, ప్రగ్యా నయన్, అజయ్ ఘోష్​, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్​, చమ్మక్ చంద్ర
డైరెక్షన్ - సంపత్ కుమార్, ప్లాట్​ఫాం - అమెజాన్ ప్రైమ్
లాంగ్వేజ్ - తెలుగు

పల్లెటూళ్లో చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు శివ (సంపత్ కుమార్). మల్లన్న అనే అతను ఒక గని తవ్వే బాధ్యతను శివకు అప్పగిస్తాడు. ఆ తవ్వకాల్లో శివుడి ప్రతిమ ఉన్న ఒక బాక్స్ బయటపడుతుంది. ఆ బాక్స్​లో చిన్న సీసాలో ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని శివ తాగుతాడు. దాన్ని తాగడం వల్ల శివకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ తర్వాత అనుకోకుండా ఆ బాక్స్ మిస్​ అవుతుంది. దాంతో మల్లన్న తన మనుషులతో శివని వెతికే పనిలో పడతాడు.

వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? శివుడి ప్రతిమ ఎక్కడుంది? శివ చేతికి తిరిగి వస్తుందా? హీరోయిన్​ని హీరో ఎలా కలుసుకుంటాడు? వంటివన్నీ ప్రశ్నలే. వీటన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సురాపానం చూడాల్సిందే. డైరెక్టర్​గా, హీరోగా రెండు పాత్రలు పోషించిన సంపత్​ కథ పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. ఓవరాల్​గా సురాపానం తాగితే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దశలకు మారిపోవడం అనేది ఇందులో ఉన్న కాన్సెప్ట్​.  కామెడీ బాగానే పండింది. 

ఫ్రెండ్​షిప్​ అంటే వీళ్లదే.. 

టైటిల్ - సురాపానం
కాస్ట్​ - నవీన్ కస్తూరియా, శివంకిత్ సింగ్​ పరిహార్, అభిలాష్​ థప్లియాల్, సన్నీ హిందుజ
డైరెక్షన్ - అపూర్వ్ సింగ్ కర్కి
ప్లాట్​ఫాం - అమెజాన్ ప్రైమ్
లాంగ్వేజ్ - హిందీ

అభిలాష్(నవీన్​ కస్తూరియా)​కి​ రామ్​పూర్​లో జిల్లా​ మెజిస్ట్రేట్​గా మొదటి పోస్టింగ్​ వస్తుంది. అక్కడి నుంచి ఈ సీజన్ మొదలవుతుంది. అభిలాష్​ జిల్లా మెజిస్ట్రేట్​గా ఎలా పనిచేస్తున్నాడనేది మెయిన్ టాపిక్​. అయితే తనతోపాటు అభిలాష్​ ఫ్రెండ్స్​ ఎస్​కే (అభిలాష్​ తపియల్), గురి (శివంకిత్ పరిహార్)లు కూడా తమ ప్రొఫెషనల్ కెరీర్​లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్​ అంతా మళ్లీ కలుసుకుంటారు.

దానివల్ల వాళ్ల పర్సనల్ గ్రోత్​, ఫ్రెండ్​షిప్​ పెరుగుతుంది. ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్​ ఎలా ఉంటాడు? నిజాయతీగల ఫ్రెండ్​షిప్​ ఎలా ఉంటుంది? ప్రొఫెషనల్, పర్సనల్​ లైఫ్​లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? వంటి విషయాల్ని బాగా చెప్పారు. అంతేకాదు.. ఈ సీజన్​ చివర్లో కూడా మరో సీజన్​ ఉంటుందని హింట్​ ఇచ్చాడు డైరెక్టర్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్​ బాగుంది. ముఖ్యంగా అభిలాష్​ క్యారెక్టర్​లో నటించిన నవీన్ కస్తూరియా యాక్టింగ్​ చాలా బాగుంది. 
 

నిజంగానే మాస్టర్ పీస్ 

టైటిల్ - మాస్టర్ పీస్
కాస్ట్​ - నిత్యామెనన్, షరఫ్​ ఉద్దీన్, రెంజి ఫణిక్కర్, మాలా పార్వతి, అశోకన్, శాంతి కృష్ణ
డైరెక్షన్ - శ్రీజిత్, ప్లాట్​ఫాం - డిస్నీ ప్లస్ హాట్​ స్టార్
లాంగ్వేజ్ - మలయాళం, తెలుగు

రియా (నిత్యామెనన్), బినోయ్ (షరఫ్​ ఉద్దీన్) కేరళలో ఉండే ఈ ఇద్దరూ ఒక డేటింగ్ యాప్​ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెండ్లి కూడా చేసుకుంటారు. ఒక అపార్ట్​మెంట్​లో కాపురం పెడతారు. కొత్త దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజమే. అలానే వీళ్లద్దరి మధ్య కూడా జరుగుతుంటాయి. ఆ విషయం తెలిసిన వాళ్లిద్దరి పేరెంట్స్ చాలా భయపడిపోతారు. వాళ్ల గొడవలకు సొల్యూషన్ చెప్పాలని ప్రయత్నిస్తారు.

ఆ క్రమంలో వాళ్లిద్దరి గురించి పేరెంట్స్​కి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి? ఇంతకీ వాళ్లిద్దర్ని పేరెంట్స్ కలిపారా? లేదా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. పెండ్లి, పిల్లల విషయంలో నేటి జనరేషన్ ఆలోచన ఎలా ఉంది? అనే విషయాన్ని ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. స్టోరీ అంతా సరదాగా సాగినా చివర్లో మాత్రం ఎమోషన్​ని టచ్ చేశారు. దాంపత్య బంధం గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్లు ఎంటర్​టైన్ చేస్తాయి. నిత్యామెనన్, షరఫ్​ ఉద్దీన్, మాలా పార్వతిల నటన బాగుంది.