ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. 

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. 

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆంక్షలు మరింత కఠినం చేయనుున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆదేశాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.
ఢిల్లీలో గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటు 0.5 శాతంగా నమోదవుతోంది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ 1 (ఎల్లో అలర్ట్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందని కేజ్రీవాల్ చెప్పారు. ఆ కారణంగానే ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల వాడకం పెరగలేదని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గతంలో కన్నా 10 రెట్లు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరారు. ఢిల్లీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, జిమ్ లు మూతపడే అవకాశముంది. బస్సులు, మెట్రో ట్రైన్లు 50శాతం సామర్థ్యంలో నడవనున్నాయి. 

For more news..

బీజేపీ గూటికి మాజీ క్రికెటర్

ప్రతీ అంశంలో కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు

 

మరిన్ని వార్తలు