చైనాలో కొత్త రూల్.. ప్రేమించుకునేందుకు స్టూడెంట్స్కు సెలవులు

చైనాలో కొత్త రూల్.. ప్రేమించుకునేందుకు స్టూడెంట్స్కు సెలవులు

స్టూడెంట్స్ కు.. ఒక దేశంలో సమ్మర్ హాలిడేస్ ఉంటే.. మరో దేశంలో వింటర్ హాలిడేస్ ఉంటాయి. అక్కడక్కడ క్రిస్ మస్ హాలిడేస్ అంటూ లాంగ్ హాలిడేస్ ఇస్తుంటారు. అయితే, ఇక నుంచి చైనాలో అలా కాదు. ప్రేమించుకోవడానికి కూడా లాంగ్ హాలిడేస్, లీవ్స్ ఇస్తున్నారు. ప్రేమించుకోండి అంటూ.. వాళ్లను స్కూల్ల నుంచి బయటికి పంపుతున్నారు. ఈ విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యానికి గురయింది. అయితే, ఈ వింత రూల్ కు కారణం లేకపోలేదు. 
 
చైనా దేశంలో బర్త్ రేటు పడిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం చైనా జనాభాలో యువకుల కంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీంతో బర్త్ రేట్ ను పెంచేందుకు కొన్న కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొన్ని స్కూల్స్, కాలేజీలు దేశంలో బర్త్ రేట్ ను పెంచేందుకు విద్యార్థులకు వారం రోజుల పాటు ‘లవ్ హాలిడేస్’ పేరుతో సెలవులను ప్రకటించినట్లు చైనా మీడియా పేర్కొంది. 

విద్యర్థులు.. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ప్రేమించుకోవాలని, రొమాన్స్, లైఫ్ మీద ఫోకస్ చేయాలని, ప్రకృతిని ఆస్వాదించాలని అక్కడి గవర్నమెంట్ సూచించినట్లు చైనా మీడియా తెలిపింది. ఇవేకాకుండా.. మరోవైపు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే చైనా ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తోంది. ఇటీవలే.. ఆర్మీ సోల్జర్లకు పిల్లల్ని కనడానికి సెలవులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.