సౌత్ కొరియాలో కొత్త రూల్.. ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ సెలవులు

సౌత్ కొరియాలో కొత్త రూల్.. ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ సెలవులు

సౌత్ కొరియా, జపాన్. చైనా లాంటి దేశాల్లో యువకుల జనాభా కంటే వృద్ధుల జనాభానే ఎక్కువగా ఉంది. దాంతో ఆయా దేశ ప్రభుత్వాలు బర్త్ రేట్ పెంచే యోచన చేస్తోంది. ఇందులో భాగంగా సౌత్ కొరియా గవర్నమెంట్ వినూత్న ఆలోచన చేసింది. దేశంలోని 18 నుంచి 28 వయసున్న యువకులంతా వాళ్ల జీవిత కాలంలో కనీసం 18 నుంచి 21 నెలల పాటు సైనిక సేవ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 30 ఏళ్ల లోపు ఉన్న పురుషులకు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్లు అధికారికంగా సెలవులు పొందొచ్చు.

బర్త్ రేట్ ను గణనీయంగా పెంచేందుకు సౌత్ కొరియా గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ బర్త్ రేట్ పెరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో ఒకే నెలలో ఎక్కువ సంతానోత్పత్తి రేటును పెంచిన దేశంగా సౌత్ కొరియా రికార్డు నెలకొల్పింది. బర్త్ రేట్ పెంచేందుకు ప్రజలకు సబ్సిడీలు. స్పెషల్ రిజర్వేషన్లు కల్పించింది అక్కడి ప్రభుత్వం.