న్యూ ఇయర్ వేడుకలకు కొత్త రూల్స్: సీపీ అంజనీ కుమార్

న్యూ ఇయర్ వేడుకలకు కొత్త రూల్స్: సీపీ అంజనీ కుమార్
  • న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసుల ఫోకస్
  • హోటల్స్, పబ్స్, ఈవెంట్స్ నిర్వాహకులతో సీపీ భేటీ
  •  కపుల్స్ ను మాత్రమే అనుమతించాలి

దిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు సీరియస్ ఫోకస్ పెట్టారు. డిసెంబర్ 31, న్యూ ఇయర్ ఈవెంట్స్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా హోటల్స్, పబ్స్, రిసార్ట్స్ లో నిర్వహించే ఈవెంట్స్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. త్రీ స్టార్ హోటల్స్, ఈవెంట్స్ జరిగే పబ్ యాజమాన్యాలతో సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం సమావేశం నిర్వహించారు. రూల్స్ కి లోబడి ఈవెంట్స్ నిర్వహించాలని వారికి సూచించారు.

  • ఈవెంట్స్ కోసం పోలీస్ కమిషనర్ వద్ద నిర్వాహకులు అనుమతి తీసుకోవాలి.
  • పర్మిషన్ లెటర్ లో పేర్కొన్న విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలి.
  • 45 డెసిబుల్స్ కి మించకుండా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
  • ఈవెంట్స్ కి వచ్చే యువతీ, యువకుల భద్రత నిర్వాహకులే వహించాలి.
  • మైనర్లను అనుమతించొద్దు.
  • పబ్స్, బార్లలో నిర్వహించే ఈవెంట్స్ కి జంటలను(కపుల్స్) మాత్రమే అనుమతించాలి.
  • ఈవెంట్స్ కి వచ్చిన వారి కోసం నిర్వాహకులే క్యాబ్స్, డ్రైవర్లను ఏర్పాటు చేయాలి.
  • ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ప్లేస్​లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • ఇన్ సైడ్ సెక్యూరిటీ బాధ్యత నిర్వాహకులదే..
  • హోటళ్లలో నిర్వహించే ఈవెంట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారినే అనుమతించాలి.
  • డ్రగ్స్, హుక్కా లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు.
  • ప్లేయింగ్ కార్డ్స్ ఆడితే అరెస్ట్ చేస్తాం.
  • అర్థనగ్న చిత్రాలతో హోర్డింగ్స్, డ్యాన్స్ లు నిర్వహించకూడదు.
  • వెపన్స్ తో ఈవెంట్స్ లోకి అనుమతించరాదు.
  • క్రాకర్స్ కు పర్మిషన్ లేదు.
  • ఎక్సైజ్ అధికారులు అనుమతించిన సమయాల్లోనే లిక్కర్ ను సర్వ్ చేయాలి.
  • ఈవెంట్స్ బయట మద్యం తాగినా, క్రాకర్స్ కాల్చినా చర్యలు తప్పవు.