లాక్ డౌన్ రూల్స్.. ఏవి తెరవాలి..ఏవి మూసేయాలి

లాక్ డౌన్ రూల్స్.. ఏవి తెరవాలి..ఏవి మూసేయాలి

కరోనా వైరస్‌‌ వ్యాప్తిని కట్టడి కోసం జీవో 45 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి నుంచి కఠిన చర్యలు చేపట్టింది. 2005 డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ యాక్ట్‌‌లోని పలు నిబంధనలు జోడించి ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి కొనసాగింపుగా సోమవారం జీవో నంబర్​46 విడుదల చేసింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు పాటించాల్సిన నియమ నిబంధనలను ఇందులో పొందుపరిచింది. అన్ని స్టేట్‌‌ బోర్డర్స్‌‌ను మూసేసింది. ఈ రూల్స్​ అన్నీ కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ నిబంధనలివీ..

  • హోం క్వారంటైన్‌‌కు రిఫర్‌‌ చేసిన వ్యక్తి ఇంట్లోనే ఉండాలి. అతిక్రమిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌‌ సెంటర్‌‌కు తరలిస్తారు.
  • ప్రజలు సోషల్‌‌ డిస్టెన్స్​ కచ్చితంగా పాటించాలి.
  • టూ వీలర్ మీద ఒక్కరు, ఫోర్  వీలర్ లో ఇద్దరు కంటే ఎక్కువగా ప్రయాణించటానికి అనుమతి లేదు. అవసరం లేకుండా ఎవరైనా టూ వీలర్‌‌తోనో, కారులో రోడెక్కితే వెహికిల్‌‌ను సీజ్‌‌ చేస్తారు.
  • అత్యవసరం, వైద్య సాయం అవసరమైన సందర్భాల్లో తప్ప రాత్రి 7 గంటల తర్వాత బయటికి రాకూడదు.
  • హాస్పిటళ్లు, మెడికల్ షాపులు మినహా అన్ని షాపులు సాయంత్రం 6.30 తర్వాత తెరిచి ఉంచకూడదు.
  • జనం కూరగాయలు, నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు నివాస ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్లు దాటి వెళ్లకూడదు.
  • నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సేవల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతి ఇస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి ప్రజలు గుమిగూడటంపై నిషేధం ఉంది.
  • నిత్యావసరాలు మినహా అన్ని రకాల షాపులు, కమర్షియల్‌‌ ఎస్టాబ్లిష్‌‌మెంట్స్‌‌, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వర్క్‌‌షాపులు, గోదాములు వంటివి తమ కార్యకలాపాలను నిలిపివేయాలి.
  • ఫార్మాస్యుటికల్స్‌‌, ఏపీఐ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌‌ యూనిట్లు మాత్రం పనిచేయవచ్చు. నిత్యావసర వస్తువులను అందజేసే రైస్‌‌ మిల్లులు, ఫుడ్‌‌ రిలేటెడ్‌‌ యూనిట్లు, డెయిరీ యూనిట్లు, దాణా, పశుగ్రాసం యూనిట్లు ఓపెన్‌‌ చేసుకోవచ్చు.
  • ఉద్యోగులు, కార్మికులు పనిచేయడానికి అనుమతించిన ఆఫీసులు, షాపులు, సంస్థల్లో పనిచేసే వ్యక్తుల మధ్య మూడు ఫీట్ల దూరం పాటించేలా మార్కులు ప్రింట్‌‌ చేయాలి.
  • సూపర్​ మార్కెట్లలో చెక్‌‌ అవుట్‌‌ కౌంటర్ల వద్ద సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌ ఏర్పాట్లు చేయాలి.
  • ఆఫీసులు, సంస్థల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, శానిటైజర్లు, హ్యాండ్‌‌ వాష్‌‌  సదుపాయాలు కల్పించాలి.
  • ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ కు లాక్ డౌన్ సమయంలో అనుమతి ఉంది. ఉద్యోగులు, కరోనా

తెరిచి ఉంచేవి/ పనిచేసేవి

  •    బ్యాంకులు, ఏటీఎంలు, వాటికి సంబంధిత కార్యకలాపాలు
  •    ప్రింట్‌‌, ఎలక్ట్రానిక్‌‌ మీడియా సంస్థలు
  •    ఐటీ, ఐటీఈఎస్‌‌, టెలికం, పోస్టల్‌‌, ఇంటర్నెట్‌‌ సర్వీసులు
  •    నిత్యావసరాలను సరఫరా చేసే ట్రాన్స్‌‌పోర్ట్‌‌ గ్రూపులు
  •    మెడికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, ఫార్మసీ, ఫుడ్‌‌ గూడ్స్‌‌ను సరఫరా చేసే ఈ– కామర్స్‌‌ సంస్థలు
  •    రెస్టారెంట్ల నుంచి టేక్‌‌ అవే/హోం డెలివరీకి చాన్స్
  •    హాస్పిటల్స్‌‌, ఆఫ్టికల్స్‌‌, డయాగ్నస్టిక్‌‌ సెంటర్లు, మెడికల్‌‌ షాపులు, ఫార్మసీ ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌
  •    పెట్రోల్‌‌ పంపులు, ఎల్పీజీ గ్యాస్‌‌ ఏజెన్సీలు.. సప్లై, ఆయిల్‌‌ ఏజెన్సీలు.. వాటి గోదాములు, వీటికి సంబంధించిన ట్రాన్స్‌‌పోర్ట్‌‌
  •    అన్ని సెక్యూరిటీ సంస్థలు, ప్రైవేట్‌‌ సంస్థలు కూడా..
  •    కోవిడ్‌‌ 19 నియంత్రణలో పాలు పంచుకునే ప్రైవేటు సంస్థలు
  •    ఎయిర్‌‌ పోర్టులు, వాటికి సంబంధించిన సర్వీసులు
  •    సాయంత్రం 6.30 గంటల తర్వాత హాస్పిటళ్లు, మెడికల్‌‌ షాపులు తెరిచి ఉంచొచ్చు. మిగతావన్నీ ఈ టైం తర్వాత పూర్తిగా మూసేయాలి.
  •    జనం ఎక్కువగా ఉండే ఇతర ఆర్గనైజేషన్లు

పూర్తి స్థాయిలో పనిచేసే ప్రభుత్వ డిపార్ట్​మెంట్లు

  • జిల్లా కలెక్టరేట్లు, డివిజనల్‌‌, మండల ఆఫీసులు
  • పోలీస్‌‌  డిపార్ట్​మెంట్
  • హెల్త్‌‌  డిపార్ట్​మెంట్
  • మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, వాటి అనుబంధ సంస్థలు
  • ఫైర్‌‌  డిపార్ట్​మెంట్
  • ట్యాక్సేషన్‌‌, ఎక్సైజ్‌‌, వాణిజ్య పన్నులు, ట్రాన్స్‌‌పోర్ట్‌‌, స్టాంప్స్‌‌ అండ్‌‌ రిజిస్ట్రేషన్స్‌‌
  • ఎలక్ట్రిసిటీ, వాటర్‌‌ సప్లై డిపార్ట్​మెంట్లు
  • అగ్రికల్చర్‌‌, హార్టికల్చర్‌‌, యానిమల్‌‌ హజ్బెండరీ, ఫిషరీస్‌‌, అగ్రికల్చర్‌‌ మార్కెటింగ్‌‌
  • సివిల్‌‌ సప్లయీస్‌‌
  • పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు, లీగల్‌‌ మెట్రాలజీ, డ్రగ్​ కంట్రోల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌

పూర్తిగా మూసివేసేవి

  • స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలు
  • అంగన్‌‌వాడీ సెంటర్లు
  • హోటళ్లు, రెస్టారెంట్లు