
హైదరాబాద్ : సర్కార్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ సిబ్బందికి కొత్త జీతాలు అమలు చేయాలని సర్కార్ సోమవారం సర్క్యూలర్ జారీ చేసింది. ఒక్కో వర్కర్‌కు రూ. 15,600 వేల చొప్పున ఇవ్వాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ప్రభుత్వం తెలిపింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. వాస్తవానికి మార్చి నుంచే కొత్త వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐలను అమలు చేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్ట్‌లు తీసుకున్న కొన్ని సంస్ధలు నిబంధన ప్రకారం వేతనాలు ఇవ్వలేదు.
టెండర్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా సతాయిస్తూ వచ్చాయి. ఓపిక నశించిన కార్మికులు డీఎంఈ ఆఫీసులను వరుసగా ముట్టడిస్తూ న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. డా రమేష్‌రెడ్డిని నేరుగా కలసి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో పెంచిన వేతనాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనంటూ సర్కార్మరోసారి సర్క్యూలర్ ను జారీ చేసింది. నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెంచిన జీతాలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని సూచించిన డీఎంఈ .. ప్రతీ 100 బెడ్లకు 45 మంది ఉద్యోగులు ఉండాలని తెలిపింది.