మద్యం వల్ల అనేక రోగాలు వస్తాయట..!

మద్యం వల్ల అనేక రోగాలు వస్తాయట..!

చాలా మంది మానసిక ఉల్లాసం కోసం మద్యం తాగుతుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకుంటే మెదడు యాక్టివ్ అవుతుందని చెబుతుంటారు. కానీ మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఉందని మరోసారి తేలింది. మద్యపానంతో రకరకాల క్యాన్సర్స్ బారినపడే ప్రమాదం ఉందని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి.  తినేదైనా... తాగేదైనా... ప్రతి దానికీ ఓ పరిమితి ఉండాలి. ఆల్కహాల్ విషయంలో మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ అతిగా తీసుకుంటే మెదడులో యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు అని లేటెస్ట్ స్టడీస్ లో తేలింది.

మద్యపానంతో లివరేకాదు... నోరు, పెదవులు, స్వర పేటిక, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్స్ బారినపడే ప్రమాదముందని అంతర్జాతీయంగా నిర్వహించిన స్టడీస్ చెబుతున్నాయి. స్మోక్  చేయడం వల్ల కూడా డైరెక్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు. రక్తనాళాలు పాడై....ఎన్నో రకాల క్యాన్సర్లకు దారి తీస్తుంది. ప్రపంచంలో మద్యం కారణంగా ఏటా 30 లక్షల మంది చనిపోతుండగా... ఇందులో 7లక్షల 40 వేలమంది మద్యం, స్మోకింగ్ తో వచ్చే క్యాన్సర్ వల్లే మరణిస్తున్నారు. 

మద్యానికి ధూమపానం తోడైతే శరీరంలోని మొత్తం మెటాబాలిజమ్ దెబ్బతింటుందని డాక్టర్స్ చెబుతున్నారు. బై ప్రాడెక్ట్స్ తోనూ వివిధ రకాల క్యాన్సర్లు వస్తాయి. యంగేజ్ వాళ్ళకు సడెన్ హార్ట్ అటాక్స్ రావడం కూడా స్మోకింగ్ వల్లే అంటున్నారు. రా అల్కహాల్ తోనూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.  

మద్యం శరీరంలోకి వెళ్ళగానే... జీవనక్రియలో భాగంగా అది విచిన్నమై, ఎసిటేల్ డీహైడ్ గా మారుతుంది. దాంతో అతి ప్రమాదకర కార్సినోజెనిక్ రసాయనాలు పుడతాయంటున్నారు న్యూట్రిషియనిస్ట్స్. అవయవాలపై దాని ప్రభావం పడితే క్యాన్సర్ ఎటాక్ అవుతుందని చెబుతున్నారు. ధూమపానం, నిద్ర లేమి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, స్ధూలకాయం లాంటివి కూడా తోడవుతాయి. ఆరోగ్యకర పోషక విలువలను శరీరం గ్రహించే తత్వం కోల్పోతుందని చెబుతున్నారు. క్యాన్సర్ త్వరగా రావడానికి అవకాశాలెక్కువ ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఏటా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. సో ఇప్పటికైనా మద్యపానం, స్మోకింగ్ కి అలవాటు పడిన వారు వాటికి దూరంగా ఉంటే బెటర్ ..లేదంటే క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యల తెచ్చుకున్నట్లే.

మరిన్ని వార్తల కోసం:

అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది

ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం