మీకు షుగర్ ఉందా.. అయితే మీ గుండె షేప్ మారిపోతుంది అంట.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

మీకు షుగర్ ఉందా.. అయితే మీ గుండె షేప్ మారిపోతుంది అంట.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

డయాబెటిస్.. అదే చక్కెర వ్యాధి.. షుగర్ వ్యాధే కదా.. అని చాలా మంది చాలా సింపుల్ గా తీసేస్తుంటారు. కానీ ఇది మోగిస్తున్న డేంజర్ బెల్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఫెయిల్యూర్ కేసులు పెరుగుతున్న తరుణంలో.. టైప్ 2 డయాబెటిస్ కారణంగా గుండెపోటు మరింత పెరిగే ఛాన్స్ ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనివలన హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోవటమే కాదు.. గుండె పరిమాణం కూడా మారిపోతుందని సైంటిస్టులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. 

హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సందర్భంగా సిడ్నీ వైద్యులు, సైంటిస్టులు భయంకర విషయాలను గమనించారు. డయాబెటిస్ అనేది గుండె కణాలలో మార్పులకు కారణం అవుతోందని కనుగొన్నారు. దీని కారణంగా గుండె కండరాలలో చాలా మార్పులు వస్తున్నాయని EMBO Molecular Medicine అనే రీసెర్చ్ పేపర్ ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా గుండె ఫెయిల్ అవ్వటానికి ముఖ్య కారణమైన ఇష్కేమిక్ కార్డియో మయోపతి ఉన్న పేషెంట్లలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నట్లె తెలిపారు. 

రక్త ప్రసరణకు, ఒత్తిడి సమయంలో కంట్రోల్ చేసుకునేందుకు అది ఉత్పత్తి చేసుకునే శక్తిపై డయాబెటిస్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు స్టడీలో తేలింది. గుండె మార్పిడి కోసం డోనర్ నుంచి తీసుకున్న గుండె కణజాలం ఆధారంగా.. డయాబెటిస్ అనేది గుండె వ్యాధులను పెంచడమే కాకుండా.. బయాలజికల్ ప్రాసెస్ ను డిస్టర్బ్ చేయడం.. కండరాలలో మార్పులకు కారణం అవుతుందని వెల్లడించారు. దీని కారణంగా గుండె ఆకారం మారిపోవడంతో పాటు గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుందని చెప్పారు. 

డయాబెటిస్ కారణంగా గుండె ముడుచుకుపోకుండా ఉండేందుకు  కావాల్సిన కీలక ప్రోటీన్స్ ఉత్పత్తి తగ్గిపోవడంతో.. రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం మెల్లమెల్లగా తగ్గిపోతుందని తెలిపారు. అంతే కాకుండా జీన్ ట్రాన్స్క్రిప్షన్ (జన్యువులో దాగి ఉండే హిస్టరీ)  లెవల్ లో కూడా ఇది ప్రభావం చూపుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన క్లూ ఉంటేనే ఇతర మార్పులను కనుగొనవచ్చునని అంటున్నారు.

అణువుల స్థాయిలోనే డయాబెటిస్  గుండె ఉత్పత్తి చేసుకునే శక్తిపై ప్రభావం చూపుతోందని.. దీని కారణంగా హార్ట్ షేప్, సైజు మారిపోతోందని ఈ స్టడీలో తేలింది. సైజు మారడంతో రక్తప్రసరణలో మార్పులు, సిస్టోలిక్, డయాస్టోలిక్ పీడనాల్లో తేగాల కారణంగా గుండె పోటు మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.