సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌: కొత్త కార్యాలయంలో బుకింగ్ సేవలు ప్రారంభo

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌: కొత్త కార్యాలయంలో బుకింగ్ సేవలు ప్రారంభo

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌కు నూతన హంగులు జోడిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 720 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ రెన్యువేషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయంలో తాత్కాలిక బుకింగ్ సేవలు నేటి(జూన్ 13) నుంచి అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 10 కౌంటర్లలో ఈ సేవలు ప్రారంభించారు. ఇవి 24 గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పాత జనరల్ టిక్కెట్ బుకింగ్ కార్యాలయాన్ని జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగించనున్నారు. 

కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నందు ప్రయాణికులకు అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) టిక్కెట్‌ల కొనుగోలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, సీజన్ టిక్కెట్‌ల పునరుద్ధరణ, విచారణ వంటి అన్ని సేవలు పొందవచ్చు. వీటికి అదనంగా 4 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్ల(ఏటివిఎం)ను అందుబాటులో ఉంచారు. వీటి సహాయంతో కూడా ప్రయాణికులు టిక్కెట్లు పొందవచ్చు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు శరవేగంగాజరుగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. 2025 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.