
ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన మోటారు వాహన చట్టంపై ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భరించలేని విధంగా జరిమానాలు విధించిడం దారుణమని కొందరంటుంటే, మరికొందరు మాత్రం ఈ చట్టంతో పలు మంచి పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఎవరెలా స్పందిస్తున్నా మహేశ్ బాబు అభిమానులు మాత్రం ఈ కొత్త చట్టం, కొత్త ట్రాఫిక్ జరిమానాలతో తెగ సంబరపడుతున్నారు. తమ అభిమాన హీరో నటించిన భరత్ అనే నేను సినిమా స్ఫూర్తితోనే ఈ సవరణలు జరిగాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో సీఎం రోల్ పోషించిన మహేశ్.. రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా వాహనాలపై కొత్త చట్టాన్ని అమలు చేస్తాడు. ఇది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులకు అధిక మొత్తంలో జరిమానాలు వసూలు చేసేలా ఓ రూల్ కూడా పెడతాడు. ఈ చట్టం వల్ల మొదట ప్రజల నుండి తీవ్ర విమర్శలు వస్తాయి. కాని ఆ తరువాత ఈ కొత్త నిబంధనలతో వచ్చే ఫలితాన్ని గ్రహిస్తారు.
సోషల్ మీడియాలో మహేశ్ అభిమానులు మాత్రం ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని భరత్ అనే నేను చిత్రం చూసే అమలు చేసిందంటూ మీమ్స్ ట్వీట్ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ భరత్ అనే నేను సినిమా స్ఫూర్తితోనే అమలు చేశారని ఒకరు ట్వీట్ చేస్తే.., మరొకరు ” జరిమానాలు మంచిదే.. కాని రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వం మాటేంటి? ” అంటూ ట్వీట్ చేస్తున్నారు.
I think the government has watched #BHARATHaneNENU over the traffic rules..????
— Irshad khan (@ikirshad3) September 4, 2019
Some where it’s Very Appropriate… Fines are absolutely Good, But What about Facilities Like Roads, Medical Emergencies provided..??? but #Bharat is Best CM… #BHARATHaneNENU
— S.A.M. (@joy_samuel79) September 4, 2019