చర్లపల్లి, తిరుచానూరు మధ్య రెగ్యులర్ వీక్లీ స్పెషల్ ట్రైన్

చర్లపల్లి, తిరుచానూరు మధ్య రెగ్యులర్ వీక్లీ స్పెషల్ ట్రైన్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: చర్లపల్లి–తిరుచానూరు (ట్రైన్ నం. 17059) మధ్య నడిచే స్పెషల్​ట్రైన్ ను రెగ్యులర్​సర్వీసుగా మారుస్తూ కేంద్ర రైల్వే శాఖ అప్రూవల్​ ఇచ్చినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు ఓ  ప్రకటనలో తెలిపారు. గతంలో సందర్భానుసారంగా నడిపిన ఈ రైలును ఇక నుంచి ప్రతి ఆదివారం చర్లపల్లి–తిరుచానూరు, ప్రతి సోమవారం తిరుచానూరు– చర్లపల్లి (ట్రైన్ నం. 17060) మధ్య నడపనున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఈ నెల 17 ఆదివారం చర్లపల్లి నుంచి బయలు దేరే ఈ రైలు తిరిగి 18న సోమవారం తిరుచానూరు నుంచి చర్లపల్లికి బయలుదేరుతుందని తెలిపారు. అలాగే, ధర్మవరం–నాందేడ్​ మధ్య వీక్లీ ట్రైన్ ను సైతం రెగ్యులర్​ రైలుగా  కేంద్ర రైల్వే శాఖ అప్రూవ్​ ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ట్రైన్ నం. 17635 నాందేడ్​–ధర్మవరం, ట్రైన్ నం. 17636 ధర్మవరం–నాందేడ్​ మధ్య కూడా ప్రతి ఆదివారం, సోమవారాల్లో రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.