శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా టాలీవుడ్‌లో కొత్త పోస్టర్లు సందడి చేశాయి. ఉగాది శుభాకాంక్షలతో విడుదల చేసిన ఈ పోస్టర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రం నుంచి వరుణ్ తేజ్ న్యూ లుక్‌ను రిలీజ్ చేశారు.
అలాగే ‘సంబరాల యేటిగట్టు’ చిత్రం నుంచి సాయి దుర్గ తేజ్, ‘డెకాయిట్’ నుంచి అడివి శేష్, మృణాల్ ఠాకూర్, ‘స్వయంభు’ నుంచి నిఖిల్, ‘బ్లాక్ గోల్డ్’ మూవీ నుంచి సంయుక్త మీనన్, ‘నాగబంధం’ నుంచి విరాట్ కర్ణ, ‘నేను రెడీ’ నుంచి హవీష్, కావ్య థాపర్, ‘గరివిడి లక్ష్మి’ నుంచి ఆనంది, ‘క్రేజీ కళ్యాణం’ చిత్రం నుంచి అఖిల్ రాజ్, అభినయ కృష్ణ రూపొందిస్తున్న ‘కామాఖ్య’ నుంచి సమైరా లుక్స్ విడుదల చేశారు.
అలాగే నాని హీరోగా నటిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న మోహన్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ హైలైట్‌గా నిలిచింది. మరోవైపు ఉగాది శుభాకాంక్షలతో ఆది సాయి కుమార్ తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. గురు శరవణన్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’ అని టైటిల్ అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆది డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. జి. సురేష్ నిర్మిస్తున్నారు.
