రాజ్ భవన్ లో కొత్త సంవత్సర వేడుకలు

రాజ్ భవన్ లో కొత్త సంవత్సర వేడుకలు

న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు కేక్  కట్ చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రొగ్రామ్స్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. 

‘కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరంతో పాటు మాస్క్ ను ధరించాలి. ఒమిక్రాన్  రాకుండా ఉండాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలి. తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రం. అందుకే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందస్తున్నాను. కరోనా విషయంలో రాష్ట్ర వైద్యారోగ్యా శాఖ కృషి అభినందనీయం. ఈ విషయంలో ప్రభుత్వానికి, వైద్యారోగ్యా శాఖ మంత్రి, వైద్యారోగ్యా శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలో పెద్ద రాష్ట్రమైన తెలంగాణా ఈ ఘనత సాధించడం గొప్ప విషయం. కరోనా నేపథ్యంలో రాజ్ భవన్ లో సలహాలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్స్ లను ఏర్పాటుచేస్తున్నాం. రాజ్ భవన్ మెయిన్ గేట్ వద్ద కూడా బాక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఫిర్యాదులు చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. వ్యక్తి గత, ప్రజా సంబంధ సమస్యలపై బాక్స్ లో ఫిర్యాదులు చేయొచ్చు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ లు కొనే స్తోమత లేకపోవడంతో  20 మంది పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ లను అందజేసినందుకు సంతోషంగా ఉంది. ల్యాప్ టాప్ లు సమకూర్చిన ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు. మారుమూల గ్రామాల విద్యార్థులకు ఈ ల్యాప్ టాప్ లు అందించడం ఆనందంగా ఉంది. ఇవి వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి. కొత్త సంవత్సరం 2022లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని గవర్నర్ ఆశించారు. 

For More News..

తల్లిపాలతో జువెలరీ

పళ్లతో కారును లాగేసిన పులి