నిజామీ శైలిలో న్యూ ఇయర్ వేడుకలు: హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్

నిజామీ శైలిలో న్యూ ఇయర్ వేడుకలు: హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్

హైదరాబాద్​, వెలుగు: నూతన సంవత్సరాన్ని ఈసారి నిజామీ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తామని హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా సూఫీ ఖవ్వాలీతో అతిధులకు స్వాగతం పలుకుతారు. కచ్చే ఘోస్ట్ కి బిర్యానీ, నిజామీ బైదా పర్దా ఘోష్, ధమ్ కీ మచ్చి వంటి వంటకాలను వడ్డిస్తారు. గ్రిల్డ్ సీ ఫుడ్ , పాస్తాలు, ఆసియా స్పెషల్స్, చాట్, స్పెషల్​ హల్వా, పటస్సేరి వంటి డెజర్ట్స్ రుచులను ఆస్వాదించవచ్చు.