అపార్ట్మెంట్లో విగతజీవులుగా నలుగురు..హత్యా..ఆత్మహత్యా..

అపార్ట్మెంట్లో  విగతజీవులుగా నలుగురు..హత్యా..ఆత్మహత్యా..

అమెరికా న్యూయార్క్లో ఓ కుటుంబం దారుణ హత్యకు గురైంది. మాన్ హట్టన్ లోని అప్పర్ వెస్ట్ సైడ్ నగరంలోని అపార్ట్ మెంట్లో ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య కత్తులతో హత్య చేశారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు సహా నలుగురు ఉన్నారు. 

అప్పర్ వెస్ట్ సైడ్ నగరంలోని 328 వెస్ట్ 86వ వీధిలోని అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ ఉండే ఓ కుటుంబం ఎంతకు తలుపు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..బాధితుల ఇంటి తలుపులను బద్దలు కొట్టారు. బాధితులంతా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు.  బెడ్ రూంలో 3 ఏళ్లు, ఏడాది వయస్సున్న ఇద్దరు బాలురు విగతజీవులుగా పడిఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే 40 ఏళ్ల వయసున్న మహిళ హాలులో చనిపోయి కనిపించింది. 41 ఏళ్ళ వయసున్న వ్యక్తి కూడా బెడ్ రూంలో హత్యగావించబడ్డాడు. 

హత్యా..ఆత్మహత్యా..

భార్యా, భర్తల మెడపై గాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఇద్దరు బాలుర శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..హత్యా..లేదా ఆత్మహత్యా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.