న్యూజిలాండ్​లో సునామీ హెచ్చరికలు

న్యూజిలాండ్​లో సునామీ హెచ్చరికలు

వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్‌లో భూకంపం(New Zealand earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. న్యూజిలాండ్‌లోని (New Zealand) కెర్మాడెక్ దీవిలో భూకంపం సంభవించినట్లు సమాచారం. చైనా కాలమానం ప్రకారం రాత్రి 8.56 గంటలకు న్యూజిలాండ్‌లో ఈ భూకంపం (Earthquake) సంభవించినట్లు చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (సీఈఎన్‌సీ) తెలిపింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  భూకంపం తర్వాత సునామీ (Tsunami) హెచ్చరికలను సీఈఎన్​సీ జారీ చేసింది.