ఒక్క డెల్టా కేసుతో దేశమంతా లాక్ డౌన్!

V6 Velugu Posted on Aug 18, 2021

వెల్లింగ్టన్: ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్​లో లోకల్​ ట్రాన్స్​మిటెడ్​ కరోనా కేసు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. అది డెల్టా వేరియెంట్​ కావొచ్చని నిపుణులు అనుమానించడంతో అలర్ట్​ అయింది. దేశవ్యాప్తంగా మూడ్రోజుల లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. గత ఆరు నెలలుగా లోకల్​ ట్రాన్స్​మిటెడ్​ కేసులు నమోదు కానప్పటికీ.. డెల్టా వేరియెంట్​తో ప్రమాదమున్నందున చాన్స్ తీసుకోదలుచుకోలేదని ఆమె స్పష్టంచేశారు. డెల్టా వేరియెంట్ వల్ల ఆస్ట్రేలియా ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూడొచ్చన్నారు. అలసత్వంతో  ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ కాలం పాటు లాక్ డౌన్​లో ఉండాల్సి వస్తుందని చెప్పారు. ఆక్లాండ్​లో ఓ 58 ఏండ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు తాజాగా గుర్తించారు. దీంతో  మంగళవారం రాత్రి నుంచి దేశంలో మూడ్రోజుల పాటు.. ఆక్లాండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారం పాటు లాక్ డౌన్ విధించారు. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్​లో అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
 

Tagged New Zealand, Lockdown, Single Delta Case

Latest Videos

Subscribe Now

More News