టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

న్యూజిలాండ్ భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మొదలైంది. ఇందులో భాగంగా కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్  వన్డే సిరీస్ ను దక్కించుకోవాలని కసితో బరిలోకి దిగింది. అటు టీ20 సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో టీమిండియా ..వన్డే సిరీస్ లోనూ రాణించాలని భావిస్తోంది. మరోవైపు  సంజూ శాంసన్ , ఉమ్రాన్ మాలిక్  తుది జట్టులోకి స్థానం సంపాదించుకున్నారు. 

టీమిండియా తుది జట్టు:

 శిఖర ధావన్ ( కెప్టెన్), గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, పంత్, సంజూ శాంసన్, సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్జీదీప్ సింగ్, చాహల్.

న్యూజిలాండ్ తుది జట్టు:

ఫిన్ అలెన్, కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్