
జింబాబ్వేతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు జట్టును ప్రకటించింది. 15 మంది ప్రాబబుల్స్ లో కూడిన జట్టును సోమవారం (జూలై 7) ప్రకటించింది. ఈ టెస్ట్ సిరీస్ కు కివీస్ దిగ్గజ బ్యాటర్.. మాజీ కెప్టెన్ విలియంసన్ ను ఎంపిక చేయలేదు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ సమయంలోనే కేన్ తాను జింబాబ్వే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండనని చెప్పినట్టు న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ చెప్పాడు. ప్రస్తుతం విలియంసన్ ది హండ్రెడ్ 2025 లీగ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు
విలియమ్సన్ తో పాటు ఆల్ రౌండర్ బ్రేస్‌వెల్ హండ్రెడ్ లీగ్ కోసం జింబాబ్వే టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే జింబాబ్వే పర్యటన కోసం మాట్ ఫిషర్ తొలి సారి టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఈ సిరీస్ ద్వారా తన టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జింబాబ్వేతో ఆడబోయే ఈ టెస్టులు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాదు. ఫాస్ట్ బౌలర్లు కైల్ జామిసన్, బెన్ సియర్స్ ఈ సిరీస్ లో చోటు దక్కలేదు. జెమీసన్ వ్యక్తిగత కారణాలతో దూరం కాగా.. మేజర్ లీగ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో సియర్స్ గాయపడ్డాడు.
సీనియర్ ప్లేయర్లు అజాజ్ పటేల్, బ్యాటర్ హెన్రీ నికోల్స్ జట్టులో స్థానం సంపాదించారు. 2024లో వాంఖడేలో భారత్‌పై న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత 36 ఏళ్ల అజాజ్ ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. మరోవైపు నికోల్స్ 2023 లో బంగ్లాదేశ్ పై డిసెంబర్ లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రెండు టెస్ట్‌ల సిరీస్ లో భాగంగా జూలై 30న బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్ క్లబ్‌లో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ కూడా ఆగస్టు 7న అదే వేదికపై జరుగుతుంది. టామ్ లాథమ్ కివీస్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ALSO READ : ఇలాగైతే టీమిండియాలో చోటు ఖాయం: వరుసగా మూడు సెంచరీలు.. 16 వికెట్లు
జింబాబ్వే పర్యటనకు న్యూజిలాండ్ టెస్ట్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లుండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, విల్ యంగ్
Fast bowler Matt Fisher earns first NZ call-up while Kane Williamson remains unavailable for Zimbabwe Tests
— ESPNcricinfo (@ESPNcricinfo) July 7, 2025
Read more 👉 https://t.co/kJsqyIWKNq pic.twitter.com/y7ZiXK32sG