చెత్త కుప్పలో ఆడ శిశువు

చెత్త కుప్పలో ఆడ శిశువు

జీడిమెట్ల, వెలుగు: చెత్త కుప్పలో నవజాత శిశువును పడేసిన ఘటన పేట్​బషీరాబాద్​ పరిధిలో జరిగింది. సుచిత్రలోని గ్రీన్​ పార్క్​ఎవెన్యూలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ నవజాత ఆడ శిశువును తెచ్చి చెత్త కుప్పలో పడేసి వెళ్లారు. దీంతో స్థానికులు గమనించి డయల్​100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు వెళ్లే సరికి శిశువు చనిపోయి ఉంది. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్​కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.