
వర్ని, వెలుగు : అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో పద్మజ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం వర్ని, చందూరు, మోస్రా సెక్టార్ పరిధిలోని అంగన్ వాడీ టీచర్లతో పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముర్రు పాలలో అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తల్లులకు ముర్రుపాల ఆవశ్యకతను తెలుపాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ రాజశేఖర్, ఎంఈవో నాగనాథ్, సూపర్వైజర్లు సావిత్రి, సుమలత తదితరులు పాల్గొన్నారు.