విశ్వాసం చూపించిన కుక్క.. 27రోజులు.. 64కి.మీ. నడిచి పాత యజమానిని చేరింది

విశ్వాసం చూపించిన కుక్క.. 27రోజులు.. 64కి.మీ. నడిచి పాత యజమానిని చేరింది

ఈ ప్రపంచంలో కుక్కకున్న విశ్వాసం ఇంకెవరికీ ఉండదంటారు. దానికి ఉదాహరణే కూపర్ అనే పేరు గల కుక్క. ఇది అతని మాజీ యజమానులపై ప్రేమతో.. కొత్త యజమానుల నుంచి తప్పించుకుంది. ఇంతకుముందుకు తనను ప్రేమగా చూసుకున్న పాత ఓనర్స్ కు దగ్గరికి వెళ్లిపోయింది. అది కూడా దాదాపు 64 కిలో మీటర్లు నడిచి..

మెట్రో నివేదిక ప్రకారం , కూపర్ అనే కుక్క ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌లోని తన కొత్త ఇంటికి వచ్చిన వెంటనే కారు నుంచి దూకి, పారిపోయే ప్రయత్నం చేసింది. తర్వాత ఆ కుక్క సుమారు ఒక నెల పాటు అదృశ్యమై, దాదాపు 40 మైళ్ళు (64కిమీ) దూరంలో లండన్‌డెరీ కౌంటీలోని టోబెర్‌మోర్‌లో ఉన్న దాని పాత యజమానుల వద్దకు వెళ్లిపోయింది.

ఈ కుక్క పొలాల్లో కనిపించినట్టు ఏప్రిల్ 22న సమాచారం వచ్చిందని మిస్సింగ్ పెంపుడు జంతువుల స్వచ్ఛంద సంస్థ లాస్ట్ పావ్స్ తెలిపారు. ఐదు రోజుల తరువాత, కూపర్ తన పాత ఇంటి వైపు పరుగెత్తుతున్నట్లు మరొక కాల్ వచ్చిందన్నారు. కుక్క ఒంటరిగా అడవుల్లో, ప్రధాన రహదారుల వెంబడి నడుస్తూ వెళ్లిందని, మనుషుల సహాయం లేకుండా (రాత్రి సమయాల్లో ఎక్కువగా) వెళ్లిందని స్థానికులు తెలిపినట్టు సంస్థ వెల్లడించింది.

కూపర్ చాలా తెలివైన కుక్క అని, అది తన మునుపటి యజమాని వద్దకు ఎలా వెళ్లగలిగిందో తనకు ఇప్పటివరకూ అర్థంకావడం లేదని లాస్ట్ పావ్స్  తెలిపారు. ఆహారం లేదు, ఆశ్రయం లేదు, సహాయం లేదు, కేవలం దృఢ సంకల్పంతోనే ఆ కుక్క ఈ ఘనకార్యాన్ని పూర్తి చేసిందని మెచ్చుకున్నారు. కూపర్ కోసం తాము చాలా వెతికామన్న ఆయన.. 27 రోజుల పాటు ప్రధాన రోడ్లు, అడవులు, పొలాలు, గ్రామీణ రహదారులను దాటుతూ యజమానిని చేరుకున్నందుకు సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.

కూపర్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడని, తిరిగి బలాన్న పుంజుకునేందుకు ఇప్పుడిప్పుడే కాస్త ఆహారం తీసుకుంటున్నాడని కొత్త యజమాని నిగెల్ ఫ్లెమింగ్ తెలిపారు. అది తప్పపోయినప్పటికీ.. అది చూపించిన విశ్వాసానికి ఇప్పటికీ తాను విస్మయానికి గురవుతున్నట్టు చెప్పారు. అది వర్ణించడానికి తనకు మాటలు కూడా సరిపోవడం లేదని ఆనందం వ్యక్తం చేశారు.