10 రోజుల్లో పరిహారం చెల్లిస్తం..ఎన్హెచ్167 విస్తరణలో భూ నిర్వాసితులతో సమావేశం

10 రోజుల్లో  పరిహారం చెల్లిస్తం..ఎన్హెచ్167 విస్తరణలో భూ  నిర్వాసితులతో సమావేశం

కొడంగల్, వెలుగు: ఎన్​హెచ్​167 విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారికి 10 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని వికారాబాద్ కలెక్టర్​ప్రతీక్​జైన్ తెలిపారు. కలెక్టరెట్​లో నిర్వాసితులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు.  107 మందికి చెందిన 55,114 చదరపు అడుగుల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసిందన్నారు. ఇందులో కట్టడాలు, బోర్ వెల్స్, చెట్ల విలువలను చూసి నష్ట పరిహారం ఇస్తామన్నారు.