- ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తెలంగాణ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించింది. గడువు లోపు నివేదికను అందించకపోతే మానవహక్కుల పరిరక్షణ చట్టం కింద కమిషన్ ముందు సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలోని చాలా స్కూళ్లలో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయని మల్కాజ్గిరి కార్పొరేటర్ వూరపల్లి శ్రవణ్ గత నెల 18న ఎన్హెచ్ఆర్సీకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
