కోడికత్తి కేసు జూన్ 15కు వాయిదా

కోడికత్తి కేసు జూన్ 15కు వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈ కేసుపై గురువారం( మే11) విచారణ జరిగింది. అయితే విచారణకు ఎన్‌ఐఏ తరపున న్యాయవాది హాజరుకాలేదు.  ఈ కేసును మెుదటి నుంచి విచారిస్తున్న ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ప్రమోషన్‌పై కడపకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన న్యాయమూర్తి ఈ కేసు విచారణను మెుదటి నుంచి విచారణ చేపట్టాల్సి ఉంది.

ఈ కేసు విచారణ నిమిత్తం నిందితుడు జనిపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీనును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి విజయవాడకు తీసుకువచ్చారు. కోడికత్తి శ్రీను లాయర్ అబ్దుల్ సలీం కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే విచారణను కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో నిందితుడిని తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇకపోతే ఈ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ న్యాయస్థానం తేల్చిందని కోడికత్తి శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదించారు.