సంజయ్ దీపక్ రావు కేసులో NIA చార్జిషీట్ దాఖలు

సంజయ్ దీపక్ రావు కేసులో NIA చార్జిషీట్ దాఖలు

గతేడాది సెప్టెంబర్ లో సంజయ్ దీపక్ రావును మావోయిస్టులతో సంబధం ఉందని అనుమానంతో కెబిహెచ్ కెపిహెచ్‌బి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం (మార్చి 11)న  హైదరాబాద్ ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టులో మావోయిస్టు నేత సంజయ్ దీపక్ రావు కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. మలేషియన్ టౌన్ షిప్ ప్రాంతంలో సోదాల సమయంలో నకిలీ ఆధార్ కార్డులు, ల్యాప్ టాప్, నగదు  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

కెపిహెచ్‌బి పీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా జనవరిలో మరో కేసు నమోదు చేసి ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది.  సంజయ్ యువకులను మావోయిస్టు దళంలో చేర్పిస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు దీపక్ రావు నిధులు సమకూరుస్తున్నాడని, స్పెషల్ జోనల్‌ కమిటీ కోసం టెర్రర్ క్యాంపులు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.