
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు, పలువురు విప్లవ రచయితల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు NIA అధికారులు. రాష్ట్ర పోలీసుల సహకారంతో హైదరాబాద్ నాగోల్, అల్వాల్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నాగోల్ లోని మాజీ మావోయిస్టులు రవితో పాటు భవాని ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయిన రవిశర్మ ఇంట్లో కూడా NIA తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో అమరవీరుల బంధు మిత్రలు సంఘం నాయకురాలు పద్మకుమారి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నేతల ఇండ్లలో పుస్తకాలు , వస్తువులు చిందరవందరగా పడేసినట్లు తెలుస్తోంది. ఎందుకు సెర్చ్ చేస్తున్నారంటే పోలీసులు సమాధానం కూడా చెప్పలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం. 14లోని అంబికా టవర్స్ లోని ఓయూ విద్యార్థులు ఉంటున్న హాస్టల్ లో సోదాలు చేస్తున్నారు NIA అధికారులు.