రాష్ట్రంలో పలు జిల్లాల్లో NIA సోదాలు 

రాష్ట్రంలో పలు జిల్లాల్లో NIA సోదాలు 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేషనల్ ఇవ్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, హనుమకొండ జిల్లాలోని చైతన్య మహిళా సంఘం నేతల ఇండ్లల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ లోని కన్వీనర్ జ్యోతి, హనుమకొండ లోని అనిత ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కొన్ని గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. చైతన్య మహిళా సంఘం సమావేశాలపై నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనిత ఇంట్లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. హనుమకొండలోని తన ఇంట్లో అనితను అధికారులు విచారించారు.

అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారని.. చైతన్య మహిళా సంఘం సభ్యురాలిగా ఉండడంతోనే ఈ దాడులు చేశారని తెలిపారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేశారన్నారు. ఏపీలో జరిగిన ముంచింగ్ పుట్ కేసులో తన పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని..ఆ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పారు. గతంలో పిలిస్తే హైదరాబాద్ లోని ఎన్ఐఏ ఆఫీస్ కు వెళ్లాను. అధికారులకు తెలిసిన సమాచారం ఇచ్చినా సోదాల పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు. చైతన్య మహిళా సంఘం డాక్యుమెంట్స్, వాట్సప్ గ్రూపులో యాక్టివిటీని కూడా పరిశీలించారని తెలపారు. మ్యానిఫెస్టో, సెల్ ఫోన్, ఇతర డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారని అనిత తెలిపారు. వయో వృద్ధులైన మా తల్లిదండ్రుల ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.