‘పట్ట’ పగ్గాల్లేని ఆనందం

‘పట్ట’ పగ్గాల్లేని ఆనందం

హైదరాబాద్, వెలుగు: నిఫ్ట్ కాన్వొకేషన్ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శుక్రవారం శిల్పాకళా వేదికలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కాన్వొకేషన్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ ని అందజేశారు. ది బెస్ట్ అకాడమిక్ అవార్డ్ పేరుతో ఫ్యాషన్ డిజైన్, టెక్స్ టైల్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, యాక్సెసరీ డిజైన్, కిడ్​ వేర్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్

ఇన్ ఫ్యాషన్ మేనేజ్​మెంట్ రంగాలలో ప్రతిభ కనబర్చిన స్టూడెంట్ కి అవార్డులు ప్రదానం చేశారు.  ముఖ్య అతిథులుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డా. బి. జనార్దన్ రెడ్డి, వెల్పన్ ఫ్లూరింగ్ లిమిటెడ్, గ్లోబల్ డిజైన్ హెడ్ రితమ్ రాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. బి. జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పుడు మెడికల్, ఇంజనీరింగ్ చదవకపోతే లైఫ్ లేదు అనేట్టుగా మాట్లాడేవారని, విద్యార్థులు అలా  ఆలోచించకుండా ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. స్టూడెంట్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ని పాషన్ గా మలుచుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను, మెడల్స్ ని అందించారు.