ఇకపై ఈ పేరు ప్రతిధ్వనిస్తుంది.. హాయ్ నాన్న మూవీపై మెగా రివ్యూ ఇచ్చిన నిహారిక

ఇకపై ఈ పేరు ప్రతిధ్వనిస్తుంది.. హాయ్ నాన్న మూవీపై మెగా రివ్యూ ఇచ్చిన నిహారిక

నేచురల్ స్టార్ నాని(NaturalStar Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna). ఫాథర్ అండ్ డాటర్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కించగా.. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించారు. బేబీ కియారా కీ రోల్ లో నటించిన ఈ సినిమాను వైరా ప్రొడక్షన్ సంస్థ నిర్మించారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుండే మంచి అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలని మరింత పెంచేశాయి. దాంతో హాయ్ నాన్న సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా చూసిన ప్రేక్షకులు హాయ్ నాన్న సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అన్ని ఏరియాల నుండి ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దీంతో హాయ్ నాన్న చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా హాయ్ నాన్న సినిమాపై మెగా రివ్యూ ఇచ్చారు మెగా డాటర్ నిహారిక. ఇందులో భాగంగా ఆమె సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.  

హాయ్ నాన్న చిత్రం గురించి వర్ణించడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఇంత అద్భుతమైన సినిమాను చూస్తే మీకు మీరే మంచి చేసుకున్నవారవుతారు. సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ నటన అద్భుతం. ఇక హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన సంగీతం  ఆడియన్స్ హృదయాలను హద్దుకుంటుంది. డైరెక్టర్ శౌర్యువ్.. ఇకనుండి ఈ పేరు ఇండస్ట్రీలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నేను అబద్దం చెప్పడం లేదు.. ఇదే విషయాన్ని ఆల్రెడీ శౌర్యువ్ కి కూడా చెప్పాను.. అంటూ రాసుకొచ్చారు నిహారిక. ప్రస్తుతం హాయ్ నాన్నపై నిహారిక ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ గా మారింది.