
‘కార్తికేయ 2’తో ప్యాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్.. మరో ప్యాన్ ఇండియా మూవీ ‘స్పై’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఎడిటర్ గ్యారీ బిహెచ్ దీనికి దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్ 29న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను మే 15న ఢిల్లీలోని కర్తవ్య పథ్ (రాజ్ పథ్)లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సుభాష్ చంద్రబోస్ రహస్యాల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఆయన విగ్రహం దగ్గర టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో స్పై ఏజెంట్‌గా నిఖిల్ కనిపించనున్నాడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్. ఈ చిత్రంతో ఆర్యన్ రాజేష్ రీఎంట్రీ ఇస్తున్నాడు. సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.