నిమ్స్లో హయ్యస్ట్ ఓపీ రికార్డు..ఒక్కరోజే 4,055 మంది పేషెంట్లకు వైద్య సేవలు

నిమ్స్లో హయ్యస్ట్ ఓపీ రికార్డు..ఒక్కరోజే 4,055 మంది పేషెంట్లకు వైద్య సేవలు

హైదరాబాద్​సిటీ, వెలుగు : నిమ్స్​లో మంగళవారం అత్యధిక సంఖ్యలో అవుట్​పేషెంట్లు తరలివచ్చి వివిధ రకాల వైద్య సేవలు పొందారని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. 4,055 మంది పేషెంట్లు ఓపీతో పాటు ఇన్​పేషెంట్​గా చేరారని, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌‌‌‌మెంట్ సేవలు కూడా ఉపయోగించుకున్నారన్నారు.

 కార్డియాలజీలో 278 మంది, క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీలో 397, జనరల్ మెడిసిన్ లో 345, నెఫ్రాలజీలో 418, న్యూరాలజీలో 363, ఆర్థోపెడిక్స్ లో 347 మంది చూపించుకున్నారన్నారు. 265 మంది అడ్మిట్​అయ్యారన్నారు. అదనంగా 60 మంది రోగులు అత్యవసర విభాగంలో చికిత్స పొందారని ప్రొఫెసర్ బీరప్ప  ప్రకటించారు.