ముత్తు నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

ముత్తు నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

తమిళ హీరో శింబు ప్రస్తుతం 'వెందు తుణీందదు కాడు' చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గణేశ్ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన లిరికల్ సాంగ్ రిలీజైంది. 'నిన్నే తలదన్నే సరిజోడి నాకిక లేదే, ఇక కల్లో కూడా నువ్వు నేను వేరే కాదే' అంటూ పాట సాగుతోంది. ఈ పాటకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చగా.. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. సామ్ విశాల్–రక్షిత సురేశ్ ఆలపించారు.

ఈ సినిమాలో చదువులేని పల్లెటూరి కుర్రాడిగా శింబు కనిపించనున్నాడు. తన తల్లిని.. చెల్లిని వెంటబెట్టుకుని బతుకుదెరువు కోసం ఊరి నుండి సిటీకి వస్తాడు ఆ కుర్రాడు. సిటీలో శింబు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడనేదే చిత్ర కథ.. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాధిక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ నెల 15వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.