
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ప్రవాహం కాస్త తగ్గింది. నిన్న భారీగా వచ్చిన వరదతో చెత్త, చెట్లు ప్రాజెక్టులోకి కొట్టుకొచ్చాయి. గేట్లలో, ప్రాజెక్టుపై భారీగా చెత్త పేరుకుపోయింది. గేట్ల గేర్ల మధ్యలోనూ... చెట్లు ఇరుక్కున్నాయి. ప్రాజెక్టు పలు గేట్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఇన్ ఫ్లో తగ్గిందని.. ప్రాజెక్టుకు ముప్పులేదని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు వరద తగ్గినప్పటికీ కడెంతో పాటు పలు గ్రామాలు... జల దిగ్భంధంలోనే ఉన్నాయి. సహాయం కోసం ముంపు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.