
అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలవడంతో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా కడెం, జన్నారం మండలాలకు చెందిన రైతులు పంటను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరిధాన్యం తడిసిపోయింది. ధాన్యం తెచ్చి నెల రోజులు అయినా …తేమ ఉందంటూ అధికారులు ఆలస్యం చేశారని చెప్తున్నారు. కనీసం ధాన్యం నింపేందుకు గోనె సంచులు అడిగినా అధికారులు లేవని చెప్తున్నారని అంటున్నారు. ఆరుబయట ఆరబెట్టిన ధాన్యంపై కప్పేందుకు టార్బెయిట్ పట్టాలు కూడా అందుబాటులో లేవని వాపోతున్నారు రైతులు.