నిర్మల్ పర్యాటకరంగ అభివృద్ధికి ప్రణాళిక

నిర్మల్ పర్యాటకరంగ అభివృద్ధికి ప్రణాళిక

నిర్మల్,వెలుగు: నేషనల్ హైవే (ఆర్ అండ్ బీ) ఆధీనంలోని ఐబీ (ఇన్​స్పెక్షన్​ బంగ్లా)ల ప్లేస్​లో హరిత హోటళ్ల ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. నిర్మల్ పట్టణంలోని ఐబీని తొలగించి హరిత రిస్టార్ట్​నిర్మించాలని ఆఫీసర్లు ప్రతిపాదించారు. గతంలో ఐబీలు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్​పోర్ట్​హైవేస్ (ఎంవో ఆర్టీహెచ్) పరిధిలో ఉండేవి. క్రమంగా వాటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. వీటిని ఇప్పుడు పర్యాటక శాఖకు కేటాయించనున్నారు. టూరిజం డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకుంటున్నారు.​ నిర్మల్ లో హరిత రిసార్ట్ కోసం రూ. 12 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఫండ్స్​ రిలీజ్​అయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

రిసార్ట్ లో నాలుగు రూమ్​లు ఆర్ అండ్ బీ కే....

ఐబీల స్థానంలో నిర్మించనున్న ఒక్కో రిసార్ట్​లలో మొత్తం 50కి పైగా గదులు ఉంటాయి. ఇందులో నాలుగు సూట్లను ఆర్​ అండ్ బీ శాఖకు అలాట్ చేయాలని నిర్ణయించారు. ఉచిత వసతి, భోజన సౌకర్యాన్ని కూడా రిసార్ట్​ద్వారానే అందించనున్నారు. పర్యాటకుల ద్వారా ఆదాయం సమకూర్చుకోనున్నారు. ప్రభుత్వ ఖజానకు జమచేయనున్నారు.

టూరిజంశాఖకు ఇచ్చేశాం..

నిర్మల్ ఐబీని టూరిజం శాఖ స్వాధీనం చేసుకోనుంది. త్వరలో హరిత రిసార్ట్ నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభం అవుతాయి.

- అశోక్ కుమార్, 
ఈఈ, ఆర్ అండ్ బి, నిర్మల్