వాడకంలో రూ.130 కోట్ల విలువైన ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-రూపాయిలు

వాడకంలో రూ.130 కోట్ల విలువైన ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-రూపాయిలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ.130 కోట్ల విలువైన ఈ–రూపాయలు/డిజిటల్​ రూపాయలు వాడకంలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  హోల్​సేల్​ సెగ్మెంట్ డిజిటల్​ రూపాయిని 2022 నవంబరులో, రిటైల్​ సెగ్మెంట్​లో డిజిటల్​ రూపాయిని 2022 డిసెంబరులో పైలట్​ పద్ధతిన ఆర్​బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ , హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ వంటి తొమ్మిది బ్యాంకులు డిజిటల్ రూపాయి హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ పైలట్​లో పాల్గొంటున్నాయి.

డిజిటల్ రూపాయి డిజిటల్​ టోకెన్​ రూపంలో ఉంటుంది. ఫిజికల్ కరెన్సీకి సమానంగా దీనికీ విలువ ఉంటుంది. పేపర్​ కరెన్సీ డినామినేషన్ల మాదిరే దీనినీ విడుదల చేస్తారు. బ్యాంకులో అందించే డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డిజిటల్ రూపాయిని ఉపయోగించుకోవచ్చు. టీ సెల్లర్లు, పండ్ల అమ్మకందారులు, చిన్న దుకాణదారులు వంటి వాళ్లు కూడా డిజిటల్​ రూపాయిని వాడుతున్నారని సీతారామన్ చెప్పారు. రిటైల్ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పెట్రోల్ పంపులు మొదలైనవి కూడా డిజిటల్ రూపాయిని తీసుకుంటున్నాయని, కొంతమంది ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్​ కంపెనీలు కూడా డిజిటల్ రూపాయిని అంగీకరిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.