నిజామాబాద్ లో స్కానింగ్ సెంటర్ ఉద్యోగులు మోసం.. 70 లక్షలు బొక్కేశారు..

 నిజామాబాద్ లో స్కానింగ్ సెంటర్ ఉద్యోగులు మోసం.. 70 లక్షలు బొక్కేశారు..
  • ముగ్గురిపై కేసు, ఒకరు అరెస్ట్

నిజామాబాద్, వెలుగు: స్కానింగ్​ సెంటర్​ మేనేజ్​మెంట్​ను ఆరేండ్లుగా మోసం చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని శాన్వీ స్కానింగ్  సెంటర్​లో సూపర్​వైజర్​గా​గుండారం సత్యనారాయణ, ఉద్యోగిగా మీనా పని చేస్తున్నారు. వారికి కీలకమైన బిల్స్​ సెక్షన్​ బాధ్యతను అప్పగించారు. అయితే స్కానింగ్​ కోసం వచ్చే వారి నుంచి తీసుకున్న ఫీజుకు ఒరిజినల్  బిల్  ఇచ్చి కార్బన్​ పేపర్ సాయంతో మేనేజ్​మెంట్​ రికార్డుల్లో తక్కువ అమౌంట్​ నమోదు చేసేవారు. 

ఇలా ఆరేండ్ల నుంచి రూ.70 లక్షల వరకు నొక్కేశారు. విషయాన్ని గుర్తించిన మేనేజ్​మెంట్​ వన్​టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి గుండారం సత్యనారాయణను అరెస్ట్​ చేశారు. ఈ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ కావడంతో.. సత్యనారాయణతో పాటు అతని భార్యపై కూడా కేసు నమోదు​చేశామని ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు.