ఇండియాలోని రెగ్యులేటరీ సిస్టమ్స్​ పటిష్టంగా ఉన్నాయ్

 ఇండియాలోని రెగ్యులేటరీ సిస్టమ్స్​ పటిష్టంగా ఉన్నాయ్

వాషింగ్టన్: అదానీ గ్రూప్​ పరిణామాలపై ఇప్పుడు మాట్లాడలేనని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ చెప్పారు. వరల్డ్​ బ్యాంక్​, ఐఎంఎఫ్​ సమావేశాల కోసం అమెరికా వచ్చిన మినిస్టర్​తో బ్లూమ్​బర్గ్​ మాట్లాడారు. హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ రిపోర్టు, ఆ తర్వాత అదానీ గ్రూప్​ షేర్లకు వచ్చిన భారీ నష్టం, సంబంధిత అంశాలపై ఏమీ చెప్పలేనని, ఎందుకంటే అది కోర్టులో ఉందని నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు.

యూఎస్​ షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​ చేసిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన పానెల్​ దర్యాప్తు జరుపుతోందని ఆమె వివరించారు. ఇండియాలోని రెగ్యులేటరీ సిస్టమ్స్​ పటిష్టంగా ఉన్నాయని, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే సామర్ధ్యం వాటికి ఉందని ఫైనాన్స్​ మినిస్టర్ ఈ సందర్భంగా చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పన, ప్రైవేటీకరణలో జోరు తగ్గడం, దేశం ఎదుర్కొంటున్న ఎకనమిక్​ ఛాలెంజెస్​ వంటి అంశాలపై నిర్మలా మాట్లాడారు. ఉక్రెయిన్​ వార్​, ఒపెక్​ ప్లస్​ దేశాల ప్రొడక్షన్​ కోత వంటివి తమకు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.