వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడిన నిశాంత్

వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడిన నిశాంత్

బస్టో అర్సిజియో (ఇటలీ) :  ఇండియా బాక్సర్ నిశాంత్ దేవ్ కొద్దిలో ఒలింపిక్ బెర్త్ చేజార్చుకున్నాడు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిశాంత్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఓడిపోయాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 71 కేజీ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిశాంత్ 1–4తో  అమెరికాకు చెందిన ఓమరి జోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈ  టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. క్వాలిఫయర్ టోర్నీలో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్ బెర్తు కేటాయించారు. ఇండియా నుంచి పోటీపడ్డ బాక్సర్లెవ్వరూ  పారిస్ బెర్తు సాధించలేకపోయారు.